YouTube ఛానల్ యజమానులకు గుడ్‌న్యూస్.. ఇక చేతినిండా డబ్బులే డబ్బులు!

by Harish |   ( Updated:2023-06-14 11:08:32.0  )
YouTube ఛానల్ యజమానులకు గుడ్‌న్యూస్.. ఇక చేతినిండా డబ్బులే డబ్బులు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ తన కంటెంట్ క్రియేటర్లకు భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. మానిటైజేషన్‌కు సంబంధించిన నిబంధనలు ఇటీవల సవరించింది. దీని ప్రకారం, కంటెంట్ క్రియేటర్‌లు 500 మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంటే చాలు యూట్యూబ్ మానిటైజేషన్(YPP)‌కు అప్లై చేసుకోవచ్చు. దీంతో వీరు కూడా వీడియోల ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు.

గతంలో మానిటైజేషన్‌కు అర్హత పొందడానికి 1,000 మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉండాలి. పాత నిబంధనల ప్రకారం, వీరు మాత్రమే డబ్బులు సంపాదించే అవకాశం ఉండేది. ఇప్పుడు సబ్‌స్క్రైబర్‌ రేటును సగానికి పైగా తగ్గించడం ద్వారా చిన్న యూట్యూబ్ యజమానులు కూడా చేతి నిండా డబ్బులు సంపాదించవచ్చు.

పాత నిబంధనల ప్రకారం, యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్లు తప్పనిసరిగా మానిటైజేషన్‌కు అర్హత సాధించాలంటే కనీసం 1000 మంది సబ్ స్క్రైబర్స్ కలిగి ఉండటంతో పాటు, సంవత్సరంలో కనీసం 4000 గంటల వీక్షణలు లేదా చివరి 90 రోజుల్లో కనీసం 10 మిలియన్ షార్ట్స్ వీడియో వ్యూస్ ఉండాలి. దీంతో చిన్న కంటెంట్ క్రియేటర్లు చాలా మంది మానిటైజేషన్‌కు అర్హత లేక డబ్బులు సంపాదించుకోలేకపోయేవారు. కానీ వారి బాధలను అర్ధం చేసుకున్న కంపెనీ తన మానిటైజేషన్ రూల్స్‌ను మార్చి వేసింది.

కొత్త రూల్స్ ప్రకారం, 500 మంది సబ్ స్క్రైబర్స్ కలిగి ఉండటంతో పాటు, చివరి 90 రోజుల్లో కనీసం మూడు లేదా అంత కన్నా ఎక్కువ పబ్లిక్ వీడియోలను అప్‌లోడ్ చేసి ఉండాలి. అలాగే ఏడాదిలో మూడు వేల గంటల వీక్షణలు లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్ల షార్ట్ వీడియోల వ్యూస్ ఉండాలి. ఈ అర్హతలు కలిగి ఉన్నవారు ఇక మీదట మానిటైజేషన్‌కు దరఖాస్తు చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు.

వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ YouTube ప్రస్తుతానికి ఈ కొత్త నిబంధనలను అమెరికా, UK, కెనడా, తైవాన్, దక్షిణ కొరియాలో అందుబాటులోకి తీసుకొస్తుంది. త్వరలో భారత్‌తో పాటు మిగిలిన దేశాల్లో కూడా తీసుకురానుంది.

Advertisement

Next Story