ఎంపిక చేసిన డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన YES BANK!

by Vinod kumar |   ( Updated:2023-02-22 15:33:20.0  )
ఎంపిక చేసిన డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన YES BANK!
X

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యెస్ బ్యాంక్ ఎంపిక చేసిన తన ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ వడ్డీని 25-50 బేసిస్ పాయిట్లు పెంచుతూ బ్యాంకు నిర్ణయించింది. సవరించిన వడ్డీ రేట్లు ఫిబ్రవరి 21 నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, 181-271 రోజుల కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై 5.75 శాతం నుంచి 6 శాతం వడ్డీ లభిస్తుంది.

272 రోజుల నుంచి ఏడాది డిపాజిట్లపై 6 శాతం నుంచి 6.25 శాతానికి, ఏడాది నుంచి 15 నెలల డిపాజిట్లపై 7 శాతం నుంచి 7.25 శాతం పెంచుతూ బ్యాంకు నిర్ణయించింది. 15-36 నెలల ఎఫ్‌డీలకు 7.5 శాతానికి పెంచింది. మిగిలిన ఎఫ్‌డీల రేట్లలో మార్పులేమీ చేయలేదు. అదే విధంగా అన్ని కాలవ్యవధులపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ వర్తిస్తుంది. పెద్దలకు గరిష్ఠంగా 15 నెలల నుంచి 36 నెలల డిపాజిట్లపై 8 శాతం వడ్డీ లభిస్తుంది.

Also Read..

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ 'బ్యాంక్ ఆఫ్ బరోడా'లో భారీగా జాబ్స్..

Advertisement

Next Story