- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైక్ కొన్నవారికి 'క్యాసియో జీ-షాక్' వాచ్ ఉచితంగా ఇస్తున్న యమహా
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా తన ఎఫ్‌జెడ్-ఎక్స్ మోడల్ బైకులో క్రోమ్ కలర్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ. 1,39,700(ఢిల్లీ-ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. సరికొత్తగా తెచ్చిన ఈ బైక్ వేరియంట్‌ను ఇష్టపడే వినియోగదారులకు కంపెనీ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. మొదటి 100 ఆన్‌లైన్ బుకింగ్‌లు చేసిన కస్టమర్లకు బైక్ డెలివరీ సమయంలో 'క్యాసియో జీ-షాక్' వాచ్‌ను ఉచితంగా అందించనున్నట్టు వెల్లడించింది. యమహా ఇండియా అధికారిక వెబ్‌సైట్ నుంచి క్రోమ్ మోడల్‌ను కేవలం రూ. 2,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. వాహనం కొనే సమయంలో మొత్తం బైక్ ధరకు అనుగుణంగా చెల్లించిన మొత్తాన్ని సర్దుబాటు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. స్టాక్ ఆధారంగా డెలివరీలను వీలైనంత వేగంగా అందిస్తామని చెబుతోంది. బుకింగ్‌లను బట్టి డెలివరీలు అందించడానికి 45 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. 149సీసీ ఇంజిన్‌తో వస్తున్న ఎఫ్‌జెడ్-ఎక్స్ ట్రాక్షన్ కంత్ట్రోల్ సిస్టమ్, వెనుక డిస్క్ బ్రేక్, ముందు భాగంలో సింగిల్-ఛానల్ ఏబీఎస్, మల్టీ ఫంక్షన్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్‌లైట్, వెనుక మడ్‌గార్డ్, లోయర్ ఇంజిన్ గార్డ్, బ్లూటూత్ ఎనేబుల్‌డ్ వై-కనెక్ట్ యాప్ సహా అత్యాధిక ఫీచర్లు బైకులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.