Inflation: నాలుగు నెలల గరిష్ఠానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం

by S Gopi |
Inflation: నాలుగు నెలల గరిష్ఠానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది అక్టోబర్‌లో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ఠ స్థాయి 2.36 శాతానికి పెరిగింది. అంతకుముందు సెప్టెంబర్‌లో ఇది 1.84 శాతంగా నమోదైంది. ప్రధాన ఆహార పదార్థాలు, కూరగాయల ధరల పెరుగుదల కారణంగానే హోల్‌సేల్ ధరలు పెరిగాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటనలో తెలిపింది. ఆహార పదార్థాల టోకు ద్రవ్యోల్బణం 11.53 శాతం నుంచి 13.54 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సమీక్షించిన నెలలో ప్రధాన కూరగాయల ద్రవ్యోల్బణం 63.04 శాతం, తృణధాన్యాల ద్రవ్యోల్బణం 7.91 శాతం, తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 1.5 శాతం, ఉల్లి ధరలు క్షీణించినప్పటికీ 39.25 శాతంతో రెండంకెల స్థాయిలోనే ఉన్నాయి. ఆహార పదార్థాల ధరల కారణంగా టోకు ద్రవ్యోల్బణం అధికంగా ఉందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. ఈ వారంలోనే విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం సైతం 14 నెలల గరిష్ఠంతో 6.2 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. ఇది ఆర్‌బీఐ నిర్దేశించిన లక్ష్యం కంటే అధికం.

Advertisement

Next Story

Most Viewed