food prices: జులైలో స్వల్పంగా తగ్గిన ప్రపంచ ఆహార ధరలు: ఐక్యరాజ్యసమితి

by Harish |
food prices: జులైలో స్వల్పంగా తగ్గిన ప్రపంచ ఆహార ధరలు: ఐక్యరాజ్యసమితి
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఐక్యరాజ్యసమితి శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ప్రపంచ ఆహార ధరల సూచిక జులై నెలలో కొద్దిగా తగ్గినట్లు వెల్లడైంది. UN ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ధరల సూచీ ప్రకారం, ధరల తగ్గుదల జులైలో సగటున 120.8 పాయింట్లుగా నమోదైంది. అదే జూన్‌లో 121.0 గా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన సమయంలో ఒక్కసారిగా ప్రధాన ఆహార ధరలు ప్రపంచవ్యాప్తంగా గరిష్టాన్ని తాకాయి. ఉక్రెయిన్ నుంచి ఎగుమతులు తగ్గిపోవడం ధరల పెరుగుదలకు కారణమైంది. అయితే ఆ తర్వాత నుంచి పరిస్థితులు కొంత సద్దుమనగడంతో సరఫరా సమస్యలు తీరి ధరలు తగ్గడం మొదలైంది.

జులై నెలలో తృణధాన్యాల ధరల సూచిక 3.8 శాతం క్షీణించి దాదాపు నాలుగు సంవత్సరాలలో కనిష్ట స్థాయికి పడిపోయింది, అన్ని ప్రధాన తృణధాన్యాల ప్రపంచ ఎగుమతి ధరలు వరుసగా రెండవ నెలలో పడిపోయాయి. మాంసం, కూరగాయల నూనెలు, చక్కెరల పెరుగుదల కారణంగా తృణధాన్యాల సూచీ తగ్గింది. ఉత్తర అర్ధగోళంలో శీతాకాలపు గోధుమ పంటలు, కెనడా, USలో వసంత కాలపు గోధుమ పంటలకు అనుకూలమైన పరిస్థితుల కారణంగా ఉత్పత్తి పెరగడంతో గోధుమ ధరలు పడిపోయాయని నివేదిక తెలిపింది. మొక్కజొన్న ఎగుమతి ధరలు కూడా క్షీణించాయి, అర్జెంటీనా, బ్రెజిల్‌లలో పంటలు గత సంవత్సరం కంటే ముందుగానే వచ్చాయి. అలాగే యునైటెడ్ స్టేట్స్‌లో పంట పరిస్థితులు బలంగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

Advertisement

Next Story