చమురు ఉత్పత్తిపై మళ్లీ విండ్‌ఫాల్ ట్యాక్స్ అమలు!

by Harish |
చమురు ఉత్పత్తిపై మళ్లీ విండ్‌ఫాల్ ట్యాక్స్ అమలు!
X

న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్న కారణంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నును తిరిగి విధించనుంది. అందులో భాగంగా టన్ను ముడి చమురుపై రూ. 6,400 విండ్‌ఫాల్ పన్నును విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచే పన్ను అమలవుతుందని పేర్కొంది. అలాగే, డీజిల్‌పై లీటర్‌కు రూ. 0.50 ఉన్న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పన్నును పూర్తిగా తొలగించింది.

ఈ నెల మొదటివారంలో జరిగిన సమీక్షలో ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో గ్లోబల్ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 75 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఇది 85 డాలర్లకు చేరింది. చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్ ప్లస్ దేశాలు నిర్ణయించడంతో ధరలు మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలోనే కేంద్రం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తిరిగి అమల్లోకి తెచ్చింది.

కాగా, 2022, జులై 1న కేంద్రం దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురు, చమురు ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తీసుకొచ్చింది. అంతర్జాతీయ ధరలను బట్టి 15 రోజులకు ఒకసారి పన్ను సవరణ చేస్తోంది. ఎగుమతుల ద్వారా చమురు కంపెనీలు అదనంగా లాభాలను సాధిస్తున్న కారణంగా ఈ పన్నును ప్రభుత్వం తీసుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed