ఇండియా మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి: వారెన్ బఫె‌ట్

by Disha Web Desk 17 |
ఇండియా మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి: వారెన్ బఫె‌ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయని ప్రముఖ పెట్టుబడిదారుడు, బెర్క్‌షైర్ హాత్వే అధినేత వారెన్ బఫె‌ట్ అన్నారు. ఆదివారం కంపెనీ వార్షిక సమావేశంలో మాట్లాడిన ఆయన, భారత్‌లో పెట్టుబడులు పెట్టే వారికి ఏదైనా ప్రయోజనం ఉందా అనేది ప్రశ్న, ప్రయోజనాలు ఉన్నట్లయితే మేము తప్పకుండా ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటాం. గత కొన్ని సంవత్సరాలుగా, భౌగోళిక రాజకీయ అంతరాయాలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రదర్శిస్తోంది. దీంతో బెర్క్‌షైర్ హాత్వే, ఇతర ప్రపంచ కంపెనీలకు భారత్ ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను అందిస్తుందని బఫెట్ అన్నారు.

బెర్క్‌షైర్ హాత్వే భారతదేశంలో అవకాశాలను చురుగ్గా కోరుకుంటుందా అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా భారత్‌లో వ్యాపార నిర్వహణకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. భవిష్యత్తులో బెర్క్‌షైర్ హాత్వే విస్తరణకు అవకాశాలను పరిశీలించే అవకాశం కూడా ఉందని ఆయన అన్నారు. ఇటీవల బఫెట్ యాపిల్ కంపెనీలో వాటాను తగ్గించుకున్నారు. దీనిపై మాట్లాడిన ఆయన, నిర్ణయాత్మకంగా మాత్రమే వాటాను తగ్గించుకున్నామని దీనిలో ఎలాంటి దీర్ఘకాలిక వ్యహం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికి కూడా యాపిల్ కంపెనీ బఫెట్‌కు అత్యధిక వాటాలు ఉన్న కంపెనీగా నిలవడం గమనార్హం.

బెర్క్‌షైర్‌ నాయకత్వం నుంచి నిష్క్రమించిన తర్వాత వైస్ చైర్మెన్ గ్రెగ్ అబెల్, అజిత్ జైన్ కంపెనీని ముందుకు నడిపించడానికి సరైన వ్యక్తులుగా నిరూపించుకున్నారని బఫెట్ తెలిపారు. వారెన్ బఫెట్ ప్రతి సంవత్సరం సమావేశంలో ప్రసంగిస్తారు. నిర్దిష్ట పెట్టుబడులు, కార్పొరేట్ పాలన , ఆర్థిక వ్యవస్థ మొదలైన వాటితో సహా కంపెనీ భవిష్యత్ ప్రణాళికల గురించిన అనేక విషయాలను ఈ సమావేశంలో పంచుకుంటారు.

Next Story

Most Viewed