- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Volkswagen: ఫోక్స్‌వ్యాగన్ ఇండియా యూనిట్‌కు రూ. 11 వేల కోట్ల పన్ను నోటీసులు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌ను కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కంపెనీ ఆడి, స్కోడాతో పాటు ఫోక్స్‌వ్యాగన్ కార్ల పరికరాల దిగుమతి పన్నులను ఉద్దేశపూర్వకంగా తక్కువ చెల్లించినట్టు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కంపెనీ కావాలనే తక్కువ దిగుమతి పన్నులను కట్టడం వల్ల రూ. 11,000 కోట్లకు పైగా పన్ను ఎగవేసింది. కంపెనీ దాదాపు మొత్తం కారును అసెంబ్లింగ్ చేయని స్థితిలో దిగుమతి చేసుకుంది. ఇది నిబంధనలకు విరుద్ధం. దాదాపు మొత్తం కారును దిగుమతి చేయడం వల్ల 30-35 శాతం పన్ను వర్తిస్తుంది. అయితే, కంపెనీ అవన్నీ వేర్వేరు భాగాలుగా దిగుమతి చేసుకున్నట్టు వర్గీకరించి కేవలం 5-15 శాతం మాత్రమే చెల్లించింది. ఈ కారణంగా తాజా పన్ను నోటీసులను జారీ చేసినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అధిక పన్నుల నుంచి తప్పించుకునేందుకు ఉద్దేశపూర్వకంగా కంపెనీ సరుకులను వేర్వేరుగా దిగుమతి చేసినట్టు ప్రభుత్వం గుర్తించింది. 2012 నుండి, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా యూనిట్ భారత ప్రభుత్వానికి దిగుమతి పన్నులు, ఇతర సంబంధిత పన్నుల కింద సుమారు సుమారు రూ. 19.9 వేల కోట్లను చెల్లించాల్సి ఉంది. కానీ రూ. 83 వేల కోట్ల వరకు మాత్రమే చెల్లించింది.