- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vodafone Idea Vs BSNL 1999 ప్లాన్ పూర్తి వివరాలు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, ప్రైవేట్ టెలికాం కంపెనీ Vodafone Idea ఈ మధ్య కాలంలో వినియోగదారులను పెంచుకోడానికి వరుసగా కొత్త కొత్త ప్లాన్‌లను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది కస్టమర్లను కోల్పోయిన ఈ సంస్థలు, ఇతర టెలికాం సంస్థలు అయినటువంటి ఎయిర్‌టెల్, జియో లకు పోటీ ఇవ్వడానికి తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే ప్లాన్‌లను లాంచ్ చేస్తున్నాయి. అందులో భాగంగా రూ. 1999 ప్రీపెయిడ్ ప్లాన్‌పై BSNL,Vodafone Idea రెండు కంపెనీలు కూడా పలు ప్రయోజనాలను అందిస్తున్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం..
Vodafone Idea 1999 ప్రీపెయిడ్ ప్లాన్: దీనిలో వినియోగదారులకు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా లోకల్, STD కాల్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ఉంటుంది. రోజు వారి డేటా 1.5 GB హై-స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది. రోజు 100 sms లు వస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 250 రోజుల వరకు ఉంటుంది.
BSNL 1999 ప్రీపెయిడ్ ప్లాన్: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL ప్రైవేట్ కంపెనీలకు పోటీగా ఈ ప్లాన్ వ్యాలిడిటీని 365 రోజుల వరకు ఇస్తుంది. మొత్తం 600GB డేటా ప్రయోజనాలతో హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని అందిస్తుంది. రోజు 100 sms లు వస్తాయి. అదనంగా 60 రోజులు EROS NOW ఎంటర్‌టైన్‌మెంట్, 30 రోజుల పాటు Lokdhun కంటెంట్ ఉచితంగా లభిస్తాయి.