- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జియో, ఎయిర్‌టెల్‌లపై ట్రాయ్‌కు ఫిర్యాదు చేసిన వొడాఫోన్ ఐడియా!
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా పోటీ కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లు ఉచితంగా 5జీ నెట్‌వర్ సేవలను అందించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా దీనికి సంబంధించి రెండు కంపెనీలపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు లేఖ కూడా రాసింది. దీనికి సంబంధించి జియో, ఎయిర్‌టెల్‌లకు ట్రాయ్ నోటీసులు ఇచ్చింది. దీనిపై స్పందించిన కంపెనీలు 5జీ సేవలను తాము ఉచితంగా అందించడం లేదని, ఎంపిక చేసిన 4జీ ప్లాన్‌లను సబ్‌స్క్రైబ్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే ఆ సేవలు ఇస్తున్నట్టు చెప్పాయని ట్రాయ్ వెల్లడించింది.
వొడాఫోన్ ఐడియా ఇచ్చిన ఫిర్యాదుపై ఇరు కంపెనీలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. దానిపై వాదనలు విన్నాం. ఈ అంశంపై సాంకేతిక, న్యాయ, ఆర్థిక విభాగాలకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయి. అనంతరం ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటామని ట్రాయ్ వివరించింది. కాగా, టెలికాం కంపెనీలు గతంలో 2016లోనూ జియో తక్కువ ధరకు టెలికాం సేవలందిస్తున్నదనే కారణంతో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ట్రాయ్‌కు ఫిర్యాదు చేశాయి. ఇటీవల జియో ఐపీఎల్ ప్రసారం చేయడంపై ఎయిర్‌టెల్ ఫిర్యాదు చేసింది.