ఫిబ్రవరిలో పెరిగిన నాన్-వెజ్ భోజనం

by S Gopi |
ఫిబ్రవరిలో పెరిగిన నాన్-వెజ్ భోజనం
X

దిశ, బిజినెస్ బ్యూరో: గడిచిన ఏడాది కాలంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో దేశవ్యాప్తంగా శాఖాహార భోజనం ఖరీదైపోయింది. అయితే, ఈ ఏడాది ప్రారంభం తర్వాత ఉల్లి, బంగాళదుంప ధరలు తగ్గడంతో వెజ్ భోజనం ధర చౌకగా మారిందని ప్రముఖ పరిశోధనా సంస్థ క్రిసిల్ తాజా నివేదికలో తెలిపింది. అయితే, శాఖాహార భోజనం దిగిరావడంతో నాన్-వెజ్ థాలీ ఖర్చు ఫిబ్రవరిలో పెరిగిపోయిందని క్రిసిల్ పేర్కొంది. గత నెలలో ఉల్లి ధరలు 14 శాతం, బంగాళదుంప ధరలు 3 శాతం తగ్గడంతో వెజ్ థాలీ ధర 2 శాతం తగ్గి రూ. 27.5కి చేరుకుంది. టమోటాలు, పప్పులు వంటి ఆహార పదార్థాల ధరల్లో పెద్దగా మార్పులేదు. ఇక, ఫిబ్రవరిలో నాన్-వెజ్ థాలీ ధర అంతకుముందు జనవరిలో రూ. 52 నుంచి గత నెల రూ. 54కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా సరఫరా పడిపోవడంతో బ్రాయిలర్ ధరలు 10 శాతం పెరిగాయి. అందుకే నాన్-వెజ్ థాలీ ధర ఒక్కసారిగా పెరిగిందని క్రిసిల్ వివరించింది. అంతేకాకుండా రంజాన్ నెల సమీపిస్తుండటంతో డిమాండ్ పెరుగుతోందని అభిప్రాయపడింది. కానీ, గతేడాదితో పోల్చినప్పుడు భోజనాల ఖరీదు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. దేశంలో ద్రవ్యోల్బణం ఇంకా తగ్గకపోవడం ఇందుకు కారణం. ఏడాది ప్రారిపదికన ఉల్లి ధరలు 29 శాతం, టోమాటో ధరలు 38 శాతం అధికంగానే ఉన్నాయి. దీనివల్ల 2023 ఫిబ్రవరి కంటే గత నెల వెజ్ థాలీ ధర 7 శాతం ఎక్కువగా ఉంది.

Advertisement

Next Story