భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా యూఎస్!

by Aamani |
భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా యూఎస్!
X

న్యూఢిల్లీ: పెరుగుతున్న ఆర్థిక సంబంధాల నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికాగా అవతరించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రాథమిక డేటా ప్రకారం, భారత్, యూఎస్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ 2021-22లో 119.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 9.8 లక్షల కోట్ల) నుంచి 2022-23లో 7.65 శాతం పెరిగి 128.55 బిలియన్ డాలర్ల(రూ. 10.52 లక్షల కోట్ల)కు చేరుకుంది. అంతకముందు 2020-21లో ఇది 80.51 బిలియన్ డాలర్లు(రూ. 6.59 లక్షల కోట్లు)గా నమోదైంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతుల విలువ 2.81 శాతం పెరిగి 78.31 బిలియన్ డాలర్ల(రూ. 6.40 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. దిగుమతులు 16 శాతం పుంజుకుని 50.24 బిలియన్ డాలర్లు(రూ. 4.11 లక్షల కోట్ల)గా ఉన్నాయని గణాంకాలు తెలిపాయి. ఇదే సమయంలో చైనాతో వాణిజ్యం 1.5 శాతం క్షీణించడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో చైనాకు ఎగుమతులు 28 శాతం తగ్గిపోగా, దిగుమతులు 4.16 శాతం పెరిగాయి. యూఎస్, భారత్ మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం అవుతున్న తరుణంలో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య రాబోయే సంవత్సరాల్లో పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఫార్మా, ఇంజనీరింగ్, రత్నాభరణాలు వంటి వస్తువుల ఎగుమతులు పెరగడం వల్లే అమెరికాతో వాణిజ్య పుంజుకుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్(ఎఫ్ఐఈఓ) ఎ శక్తివేల్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed