ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ నిర్ణయంపై Uber సంస్థ అసంతృప్తి

by Harish |
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ నిర్ణయంపై Uber సంస్థ అసంతృప్తి
X

ఢిల్లీ: ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల నగరంలో ప్రయాణించే ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ట్యాక్సీలుగా అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా పొల్యూషన్ కారకాల వాహనాల వాడకం తగ్గుతుందని ప్రభుత్వ ఆలోచన. కానీ ఈ నిర్ణయం కారణంగా వివిధ రంగాల్లో లక్ష మంది తమ ఉద్యోగాలు కోల్పొతారని, సరుకు రవాణా రంగం తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటుందని ఉబర్ కంపెనీ తెలిపింది.

టూ-వీలర్ రైడ్‌షేరింగ్, డెలివరీ, ఇతర రంగాలకు చెందిన డ్రైవర్ల జీవనోపాధి కోల్పోవడం జరుగుతుంది. ప్రతి నెలా 20 లక్షల ట్రిప్పులు ఉంటాయని, కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ట్యాక్సీలుగా వాడటం అనేది సాధ్యం కాదు, దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ప్రవేశపెట్టాలని, ఈ విషయంలో సంబంధిత పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరపాలని ఉబర్ సంస్థ ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉబర్ కంపెనీ 2040 నాటికి తమ ట్యాక్సీలును ఎలక్ట్రిక్ వాహనాలు గా మార్చాలని చూస్తోంది.

Advertisement

Next Story