Tyre Companies:పెరగనున్న టైర్ల ధరలు

by S Gopi |
Tyre Companies:పెరగనున్న టైర్ల ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రముఖ టైర్ల తయారీ సంస్థలు పెరుగుతున్న ఖర్చు దృష్ట్యా టైర్ల ధరలను పెంచనున్నాయి. గత రెండు త్రైమాసికాలుగా ఇదే ధోరణిని అనుసరిస్తున్న కంపెనీలు మరోసారి పెంచక తప్పడంలేదని చెబుతున్నాయి. ప్రధానంగా సహజంగా లభించే రబ్బరు ఖర్చులు నిరంతరం పెరుగుతుండటం వల్లనే వరుసగా మూడో త్రైమాసికంలోనూ ఈ నిర్ణయం తీసుకుంటున్నామని కంపెనీలు వివరిస్తున్నాయి. ఇన్‌పుట్ ఖర్చులను భరించేందుకు, మార్జిన్ మెరుగుదల కోసం కొంత భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నామని సియట్, జేకే టైర్ కంపెనీలు తెలిపాయి. ఇటీవలే తము ప్యాసింజర్, కమర్షియల్ టైర్ల ధరలను 3-4 శాతం పెంచామని సియట్ పేర్కొంది. ఖర్చుల భారం కొంత సవాలుగా మారిందని, అందుకే అన్ని విభాగాల్లో పెంపు నిర్ణయం తీసుకున్నాం. రానున్న త్రైమాసికాల్లో దీన్ని నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నామని సియట్ సీఎఫ్ఓ కుమార్ సుబ్బయ్య చెప్పారు. జేకే టైర్ కూడా గడిచిన రెండు త్రైమాసికాల్లో 3-4 పెంచామని, మరో 1-2 శాతం పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. కంపెనీలు ధరలు పెంచేందుకు ముఖ్యమైన ముడిపదార్థం రబ్బదు ధరలు ఇప్పటివరకు 55 శాతం పెరిగాయని ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శశి సింగ్ అన్నారు. ప్రస్తుతం దేశంలో 5.5 లక్షల టన్నుల రబ్బరు కొరత ఉంది. దీనివల్ల టైర్ల తయారీ కంపెనీలు దిగుమతులపై ఆధారపడటం, తద్వారా ఉత్పత్తి ఖర్చులపై భారం పడుతోందని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story