- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇండియాలో ట్విట్టర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ ధరలు ఇవే!
దిశ, వెబ్‌డెస్క్: ఎలాన్ మస్క్ చేతుల్లోకి వచ్చాక ట్విట్టర్‌లో చాలా మార్పులు వస్తున్నాయి. ఇటీవల సెలబ్రిటీలకు ఉండే బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ విషయంలో కొంత అమౌంట్‌ను వసూలు చేస్తామని ప్రకటించిన విధంగానే మస్క్ దానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకమీదట బ్లూటిక్ కావాలనుకునే వారు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. భారత్, అమెరికా, కెనడా వంటి కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.
ఇండియాలో అయితే, వెబ్ యూజర్లు నెలకు రూ. 650 చెల్లించాలి. అదే, ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ వినియోగదారులు బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు రూ. 900 చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీంతో పాటు వార్షిక ప్లాన్‌ను కూడా తీసుకొచ్చారు. దీని ధర రూ. 6,800. గతంలో సెలెబ్రిటీలు, ప్రభుత్వ సంస్థలు, కంపెనీలకు మాత్రమే బ్లూట్లిక్ ఉండేది. కానీ ఇకమీదట డబ్బులు చెల్లించి ఎవరైనా బ్లూటిక్ సబ్‍స్క్రిప్షన్ తీసుకోవచ్చు.
బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా వినియోగదారులకు అదనంగా మరిన్ని ఆప్షన్స్ ఉంటాయి. పోస్ట్ చేసిన తర్వాత ట్వీట్‌ను ఎడిట్ చేసుకునే ఆప్షన్, ఎక్కువ క్వాలిటీ కలిగిన వీడియోలను అప్‌లోడ్ చేయడం, యాడ్స్ తక్కువగా కనిపించడం, బుక్ మార్క్ ఆర్గనైజింగ్, డిస్‌ప్లే పేరు లేదా ప్రొఫైల్ పిక్‌ను మార్చుకునే అవకాశం మొదలగు సదుపాయాలు ఉంటాయి. ఫేక్ అకౌంట్లను తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుందని కంపెనీ అధికారులు పేర్కొన్నారు.