- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్.. ఆ రోజు నుంచి ఆటోమొబైల్ ఉత్పత్తులపై సుంకాలు

దిశ, వెబ్ డెస్క్: Auto Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పరస్పర పన్నుల విషయంలో వెనక్కి తగ్గబోనని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలు విధించే యోచనలో ట్రంప్(Donald Trump) ఉన్నట్లు శుక్రవారం తెలిపారు. అయితే ఆటోమొబైల్ ఉత్పత్తు(Automobile production)లన్నింటిపైనా సుంకాలు(Tariffs) విధిస్తారా లేదా అనే విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
ఆదాయాన్ని పెంచడానికి వాణిజ్య అసమతుల్యతను పరిష్కరించేందుకు దిగుమతి చేసుకునే కార్లపై ట్యాక్స్ విధించడం ఓ మార్గమని ట్రంప్(Donald Trump) పేర్కొన్నారు. ఏప్రిల్ 2 నుంచి ఆటోమొబైల్ ఉత్పత్తుల(Automobile production)పై టారిఫ్స్ ఉండొవచ్చని ఆయన వెల్లడించారు. అయితే దీనిపై పూర్తి వివరాలను ట్రంప్ వెల్లడించలేదు. ఇక అమెరికాలో అమ్ముడు అవుతున్న కార్లలో దాదాపు 50శాతం దేశంలోనే తయారవుతుంటాయి. జపాన్, దక్షిణకొరియా, జర్మనీ నుంచి కొంతమేరకు దిగుమతులు ఉన్నా బ్రిటన్, ఇటలీ, స్వీడన్ నుంచి తక్కువగానే ఆటోమొబైల్ ఉత్పత్తులు(Automobile production) దిగుమతి అవుతున్నాయి.కాగా గ్లోబల్‌డేటా డేటా ప్రకారం, వోక్స్‌వ్యాగన్ AG US అమ్మకాలలో దాదాపు 80శాతం దిగుమతి చేసుకుంటున్నారు. అయితే హ్యుందాయ్-కియా US అమ్మకాలలో 65శాతం దిగుమతి చేసుకుంటున్నారు.
ట్రంప్(Donald Trump) సుంకాల విధింపు విధానంతో ఆటోమొబైల్ పరిశ్రమలో గందరగోళం ఏర్పడుతోందని ప్రముఖ ఆటో మొబైల్ ఉత్పత్తుల సంస్థ ఫోర్డ్ సీఈవో జిబ్ ఫర్లీ పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం సుంకాల పెంపు బెదిరింపులు, ఎలక్ట్రిక్ వాహనాల(Electric vehicles)పై ద్వేషం వల్ల చాలా ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అమెరికాలో వాహనాల తయారీకి ప్రాధాన్యం అని ట్రంప్ చెప్పినప్పటికీ టారిఫ్ ప్రణాళిక కారణంగా విధాన అనిశ్చితి నెలకుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాగా రెండు రోజులు అమెరికా పర్యటనను ముగించుకుని భారత ప్రధాని మోదీ(MODI) స్వదేశానికి బయలుదేరారు. ట్రంప్ ప్రభుత్వంలోని పలువురు ప్రతినిధులు ప్రధాని మోదీకి వీడ్కోలు పలికారు. ఈ పర్యటనలో భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక (India-US bilateral relations)బంధాలు మరింత బలపడేలా రెండు దేశాధినేతలు వాణిజ్యం, రక్షణ, సాంకేతికత సహా పలు కీలక రంగాలపై చర్చలు జరిపి కీలక ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అమెరికా భారత్ కోసం అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే ఓ భారీ ఒప్పందాన్ని కూడా ప్రకటిస్తామని తెలిపారు.