Toyota: 35% పెరిగిన టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు

by Harish |
Toyota: 35% పెరిగిన టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: పండగల సీజన్ సమీపిస్తున్న వేళ ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం, ఆగస్టు నెలలో మొత్తం విక్రయాలు 35 శాతం వృద్ధిని నమోదు చేసి 30,879 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో దేశీయ, ఎగుమతుల్లో మొత్తం అమ్మకాలు 22,910 యూనిట్లు కాగా, ఈ సారి మరింత పెరగడం గమనార్హం. టయోటా కిర్లోస్కర్ ఉన్నతాధికారి శబరి మనోహర్, ఒక ప్రకటనలో మాట్లాడుతూ, పండుగల సీజన్‌ను సమీపిస్తున్నందున, మా ఉత్పత్తులకు డిమాండ్ ఉల్లాసంగా ఉంది, అన్ని డీలర్‌షిప్‌లలో వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ లభిస్తుందని అన్నారు.

SUVలు, MPVలు కంపెనీ విక్రయాలు పెరగడానికి గణనీయంగా దోహదపడుతున్నాయి, ఈ సెగ్మెంట్ వాహనాలకు మార్కెట్లో పెరుగుతున్న ప్రాధాన్యతను ఇది ప్రతిబింబిస్తుంది, ఈ ధోరణి పట్టణ కేంద్రాలకు మాత్రమే పరిమితం కాకుండా టైర్-2, టైర్-3 మార్కెట్‌లకు కూడా విస్తరించిందని ఆయన తెలిపారు. కంపెనీ, వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఆగస్టులో ఇన్నోవా హైక్రాస్ ZX & ZX (O) మోడళ్ల బుకింగ్‌లను తిరిగి అందుబాటులోకి తెచ్చింది. అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మార్కెట్ డిమాండ్‌ను తీర్చడానికి వీలు కల్పించింది, ఉత్పత్తి పెరగడం, మెరుగైన సరఫరా గొలుసుతో కస్టమర్లు వేయిటింగ్ పీరియడ్‌ను గణనీయంగా తగ్గించాం, టాప్-ఎండ్ గ్రేడ్‌ల కోసం బుకింగ్‌లను ప్రారంభిస్తున్నామని మనోహర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed