రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి హిమాలయన్ 452.. స్పెసిఫికేషన్‌లు ఇవే

by Harish |   ( Updated:2023-11-02 18:03:06.0  )
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి హిమాలయన్ 452.. స్పెసిఫికేషన్‌లు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి త్వరలో కొత్త మోడల్ బైక్ విడుదల కానుంది. దీని పేరు ‘హిమాలయన్ 452’. ఈ మోడల్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు ఇటీవల మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇది 451.65cc ఇంజన్‌తో వస్తుంది. ఇంజన్‌ 8000rpm వద్ద 40hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదే 5500rpm వద్ద 40Nm టార్కును అందిస్తుంది. దీనిలో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 17 లీటర్లు. బరువు 196 కిలోలు. సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు USD ఫోర్క్, వెనుక ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్‌ని అందించారు. ఇది ఐదు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అదనంగా బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. దీనిలో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ABSని అమర్చారు. చీకట్లో మెరుగైన కాంతి కోసం LED లైట్లను అందించారు.

Advertisement

Next Story