- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాయితీలు, ప్రోత్సాహాకాలు కోరుకుంటున్న స్టార్టప్ రంగం
దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ పారిశ్రామిక ప్రతినిధులు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే రాబోయే బడ్జెట్‌లో భారతీయ స్టార్టప్ రంగం భారీ రాయితీలు, ప్రోత్సాహాకాలను కోరుకుంటుంది. స్టార్టప్ రంగంలోని పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు స్టార్టప్‌లకు మెరుగైన నియంత్రణ, పన్ను తగ్గింపులతో సహా మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని బడ్జెట్‌లో కోరుకుంటున్నారు.
చాలా స్టార్టప్‌లు మూలధనాన్ని సమీకరించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నందున, రాబోయే బడ్జెట్‌లో పెట్టుబడిదారులకు లాభదాయకతను కలిగించే అంశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. స్టార్టప్ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని పారిశ్రామికవేత్తలు కూడా ఎదురు చూస్తున్నారు. చైనా, ఇతర అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా, స్టార్టప్‌లను వారి ప్రారంభ కాలంలో ఆదుకోడానికి ప్రభుత్వం నిధులు ఇస్తుందని ఆశిస్తున్నట్లు భారత్ ఇన్నోవేషన్ ఫండ్ సహ వ్యవస్థాపకుడు అండ్ భాగస్వామి శ్యామ్ మీనన్ అన్నారు.
గ్లోబల్ టెక్ హబ్‌గా భారతదేశం స్థానాన్ని పెంపొందించే లక్ష్యంతో డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్‌సెక్యూరిటీకి ప్రభుత్వం తన పూర్తి బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు, పెట్టుబడులను ప్రోత్సహించడానికి రాయితీలు ఇవ్వాలని స్టార్టప్ నిర్వహాకులు కోరుతున్నారు. తద్వారా శాస్త్ర సాంకేతికతలో కొత్త పరిశోధనలో చేయడానికి తోడ్పాటు అందించినట్లు అవుతుంది. ఇదిలా ఉంటే మార్కెట్ నిపుణులు పలు అంశాల్లో భారీ ఎత్తున ప్రోత్సహకాలు, తోడ్పాటు అందించే అంశాలు ఉంటాయని అంటున్నారు. GST వ్యవస్థను క్రమబద్ధీకరించడం, ఎలక్ట్రిక్ కార్లు, స్కిల్ డెవలప్‌మెంట్, SMEలు, ప్రభుత్వ-ప్రైవేట్ సహకారాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలు ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు.