- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎన్‌జీ వాహనాలు కొనాలనుకుంటున్నారా.. ఈ విషయం తెలుసుకోండి ?
దిశ,వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా వాహనాల్లో సీఎన్‌జీని విరివిగా వాడుతున్నారు. సాంకేతికతగా పెద్ద మొత్తంలో ప్రయాణీకుల వాహనాల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో CNG ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో క్యాబ్‌లు నడిపేవారు, మధ్యతరగతి ప్రజలు, చిన్నకార్లు, చిన్ని చిన్న ట్రక్ ఆటోలు నడిపేవారు.. సీఎన్‌జీ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల ఆ వాహనాల వినియోగం కూడా బాగా పెరిగింది. మారుతీ సుజుకీ లాంటి కొన్ని పెద్ద కంపెనీలు డీజిల్ వాహనాల తయారీ నిలిపివేసి పూర్తిగా పెట్రోల్ అండ్ సీఎన్‌జీ వాహనాలే ఉత్పత్తి చేస్తున్నాయి. ఒక్క మారుతీ సుజుకీనే ఇప్పటికీ 10 లక్షలకు పైగా సీఎన్‌జీ వాహనాలు అమ్మింది. ఇంకా ఇతర కంపెనీలు కూడా ఈ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. మారుతీ సుజుకీ తర్వాత, టాటా, హ్యూండాయ్ వాహనాలు కూడా లక్షల్లోనే అమ్ముడయ్యాయి.
సీఎన్‌జీ కోసం వెయిటింగ్:
దేశంలో సీఎన్‌జీ వాహనాలు ప్రవేశించి ఏళ్లు గడుస్తు్న్నా..డిమాండ్‌కు తగ్గ సప్లయ్ మాత్రం కరువైంది! సీఎన్‌జీ బంకుల వద్ద వాహనాలు బారులుతీరుతున్నాయి. ఒకవేళ సప్లయ్ ఉన్నా సీన్‌జీ స్టేషన్లు తక్కువ..వాహనాలు ఎక్కువగా ఉండటంతో వాహనాలు బారులు తీరుతున్నాయి. దీంతో సీఎన్‌జీ వినియోగదారులకు వెయిటింగ్ తప్పడం లేదు. పెట్రలోతోపాటు సీఎన్‌జీ రెండు రకాల ఇందనాలు వాడుకునే వెసులుబాటు ఈ వాహనాల్లో ఉండటంతో రోజురోజుకు వీటి కొనుగోలు మరింత పెరుగుతోంది. కాస్త ఇబ్బందులు పడినా సరే సీఎన్‌జీ వాహనాలు మైలేజ్ ఎక్కువగా వస్తుండటంతో వాటినే కొంటున్నారు. పెట్రోల్ కంటే ధర తక్కువ..మైలేజ్ ఎక్కువగా ఉండటంతో ఆ వాహనాలనే ఎంచుకుంటున్నారు ఒకవేళ సీఎన్‌జీ స్టేషన్ల వద్ద వాహనాల క్యూ అధికంగా ఉన్నప్పుడు..వినియోగదారులు వెయిట్ చేసే కంటే పెట్రోల్‌తోనే నడుపుకుంటున్నారు. అది వారికి బారంగా మారడంతో పాటు కాలుష్యానికి కూడా కారణమవుతోంది.
మారుతీ సుజుకీ సీఎన్‌జీ వాహనాలే ఎక్కువ:
డీజిల్ కార్ల ఉత్పత్తి నిలిపివేసిన మారుతీ పూర్తిగా సీఎన్‌జీ & పెట్రోల్‌పై ఆధారపడింది. ప్రస్తుతం ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, సెలెరియో, డిజైర్, ఎర్టిగా, ఈకో, సూపర్ క్యారీ, టూర్-ఎస్‌తో సహా వ్యక్తిగత, వాణిజ్య విభాగంలో కంపెనీ తొమ్మిది 'S-CNG' వాహనాల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. దేశంలో ఇప్పటికే 3,700 CNG స్టేషన్లు ఉన్నాయని, CNG ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చిందని మారుతీ సుజుకీ కంపెనీ చెబుతోంది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 10,000 CNG స్టేషన్లను చేరుకోవాలనే ప్రభుత్వ లక్ష్యంతో CNG వాహనాలకు డిమాండ్ బలంగా ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది.
ఏడాదిలోగా 400 సీఎన్‌జీ స్టేషన్లు: మెఘా గ్యాస్
మెయిల్ అనుబంధ సంస్థ అయిన మేఘా గ్యాస్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తోంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కీసర వద్ద సంస్థ ఏర్పాటు చేసిన 100వ సీఎన్‌జీ స్టేషన్‌ను కంపెనీ సీఈవో వెంకటేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వచ్చే ఏడాది చివరినాటికి 400 సీఎన్‌జీ స్టేషన్లను ప్రారంభించేలా ప్రణాళికను రూపొందించుకున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 2 లక్షల పీఎన్‌జీ(పైపుల ద్వారా సహజ వాయువు) కనెక్షన్లు ఇవ్వాలనుకున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణలో 46, ఆంధ్రప్రదేశ్‌లో 28, కర్ణాటకలో 12, ఉత్తర్‌ప్రదేశ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 4, తమిళనాడులో 3, పంజాబ్‌లో 3 సీఎన్‌జీ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.