- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TCS Q2 Results: రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన టీసీఎస్..ఒక్కోషేరుపై రూ.10 డివిడెండ్
దిశ, వెబ్‌డెస్క్:టాటా గ్రూప్ దిగ్గజ సంస్థ, ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రెండో త్రైమాసిక(Q2FY25) ఫలితాలను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) ద్వితీయ త్రైమాసికంలో కంపెనీ 5 శాతం నికర లాభాన్ని(Net profit) నమోదు చేసినట్లు ప్రకటించింది. ఈ ఏడాది జులై- సెప్టెంబర్ త్రైమాసికం(July- September Quarter)లో రూ.11,909 కోట్ల నికర లాభం వచ్చినట్లు టీసీఎస్ తెలిపింది. అయితే, గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీకి రూ.11,342 కోట్ల నికర లాభం వచ్చిందని తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో వెల్లడించింది.
ఇక సంస్థ ఆదాయం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి 8 శాతం వృద్ధి(Growth) సాధించింది. ప్రస్తుత రెండో త్రైమాసికం(Second Quarter)లో కంపెనీ ఆదాయం రూ.64,259 కోట్లుగా నమోదైనట్లు టీసీఎస్ తెలిపింది. గతేడాది ఇదే టైంలో కంపెనీ ఆదాయం రూ.60,698 కోట్లుగా ఉంది. మరోవైపు..రెండో త్రైమాసిక ఆర్ధిక ఫలితాల సందర్భంగా తమ వాటాదారుల(Shareholders)కు టీసీఎస్ గుడ్ న్యూస్ తెలిపింది. ఒక్కో షేరుకు రూ.10 చొప్పున మధ్యంతర డివిడెండ్(Interim Dividend) చెల్లించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. వచ్చే నెల 5న అర్హులైన వాటాదారులకు మధ్యంతర డివిడెండ్ చెల్లించనున్నారు. ఇందుకు సంబంధించి అక్టోబర్ 18ని రికార్డ్ తేదీగా కంపెనీ నిర్ణయించింది. అయితే త్రైమాసిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజీ(BSE)లో టీసీఎస్ షేరు ధర(TCS share price) ఇవాళ 0.56 శాతం నష్టంతో రూ.4228.40 వద్ద ముగిసింది. కాగా టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా(Tata Group Chairman Ratan Tata) మరణించిన నేపథ్యంలో టీసీఎస్ తన ఫలితాలను వివరించేందుకు నిర్వహించాల్సిన మీడియా సమావేశాన్ని(Media conference) రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.