Tata Motors Q2 Results: సెప్టెంబర్ త్రైమాసికంలో తగ్గిన టాటా మోటార్స్ లాభాలు

by Maddikunta Saikiran |
Tata Motors Q2 Results: సెప్టెంబర్ త్రైమాసికంలో తగ్గిన టాటా మోటార్స్ లాభాలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాటా గ్రూప్(Tata Group)కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్(Tata Motors) సెప్టెంబర్(September)తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(Q2FY25) ఫలితాల్లో టాటా మోటార్స్ రూ. 3,450 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. కాగా గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ. 3,832 కోట్ల పోలిస్తే ఈ సారి 9.9 శాతం మేర తక్కువ లాభాలు వచ్చాయని సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది. ఇక ఈ త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 1,04,444 కోట్ల నుంచి రూ. 1,00,534 లక్షల కోట్లకు తగ్గినట్లు తెలిపింది. కాగా అక్టోబర్ నెలలో వాహనాల అమ్మకాలు తగ్గడంతో ఈ త్రైమాసికంలో సంస్థ లాభాలు తగ్గాయి. పోయిన నెలలో మొత్తం 82,682 టాటా వెహికల్స్ సేల్ అయ్యాయి. అందులో ప్రయాణికుల వాహనాలు 48,423 యూనిట్లు కాగా, వాణిజ్య వాహనాలు 34,259 యూనిట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మూడో త్రైమాసికంలో వాహనాల అమ్మకాలు పుంజుకునే ఛాన్స్ ఉందని టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(Executive Director) గిరీశ్ వాఘ్(Girish Wagh) తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed