- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
టియాగో, టిగోర్ మోడళ్ల సీఎన్‌జీ వెర్షన్లను విడుదల చేసిన టాటా మోటార్స్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎట్టకేలకు సీఎన్‌జీ విభాగంలో టియాగో, టిగోర్ వేరియంట్లను బుధవారం విడుదల చేసింది. ఈ రెండు మోడళ్ల ధరలు రూ. 6.09 లక్షల నుంచి రూ. 8.41 లక్షల మధ్య లభిస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల పెరుగుతున్న సీఎన్‌జీ మార్కెట్‌లో సామర్థ్యం పెంచుకునే దిశగా టాటా మోటార్స్ అడుగులు వేస్తోంది. భారత్‌లో వేగవంతంగా పెరుగుతున్న సీఎన్‌జీ కార్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సరికొత్త వేరియంట్లను తీసుకొచ్చాం. సీఎన్‌జీ వేరియంట్ వల్ల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని, ఇప్పటికే టియాగో, టిగోర్ కార్లకు ఉన్న గిరాకీని బట్టి ఈ కొత్త కార్ల అమ్మకాలు మరింత పెరుగుతాయని కంపెనీ అంచనా వేస్తోంది.
అంతేకాకుండా కఠినతరమైన ఉద్గార నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో సీఎన్‌జీ కార్లు చాలా తక్కువ కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తాయి. భవిష్యత్తులో వీటి వినియోగం ఎక్కువగా ఉండనుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనల విభాగం ఎండీ శైలేష్ చంద్ర చెప్పారు. 2019 ఏడాదితో పోలిస్తే 2020 నాటికి సీఎన్‌జీ కార్ల అమ్మకాలు 97 శాతం పెరిగాయని శిలేష్ చంద్ర ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా సీఎన్‌జీ స్టేషన్ల నెట్‌వర్క్ పను వేగవంతంగా జరుగుతున్నాయని, తాము ఇప్పటికే 3,500 ఔట్‌లెట్లను కలిగి ఉన్నాం. రాబోయే కొన్నేళ్లలో 10,000 స్టేషన్ల లక్ష్యంగా ఉన్నట్లు ఆయన వివరించారు.