- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
హల్దీరామ్స్‌లో సగానికి పైగా వాటా కొనేందుకు టాటా ప్రయత్నాలు!
నాగ్‌పూర్: దేశీయ మార్కెట్లో అత్యంత ఆదరణ కలిగిన స్నాక్ బ్రాండ్ హల్దీరామ్స్‌లో 51 శాతం వాటా కోసం దిగ్గజ టాటా గ్రూపునకు చెందిన కన్స్యూమర్ విభాగం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ కొనుగోలుకు నిర్ణయించిన 10 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 83 వేల కోట్ల కంటే ఎక్కువ) విలువపై టాటా కన్స్యూమర్ అసంతృప్తిగా ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఒకవేళ ఈ ఒప్పందం విజయవంతమైతే భారత మార్కెట్లో పెప్సీ, రిలయన్స్ రిటైల్‌లతో టాటా కన్స్యూమర్ పోటీ పడనుంది. భారత మార్కెట్లో మారుమూల ప్రాంతాల్లో సైతం విస్తరించిన హల్దీరామ్ ఇప్పటికే కంపెనీలోని 10 శాతం వాటా విక్రయం గురించి బైన్ కేపిటల్ సహా ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే యూకేకు చెందిన టీ బ్రాండ్ టెట్లీ, స్టార్‌బక్స్ ఇండియాతో భాగస్వామ్యం కలిగిన టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ హల్దీరామ్స్‌లో వాటా కొనుగోలుపై ఆసక్తి ఉన్నట్టు తెలుస్తోంది. హల్దీరామ్స్‌లో 51 శాతం కంటే ఎక్కువ వాటాను కొనేందుకు టాటా భావిస్తున్నప్పటికీ, కంపెనీ ఎక్కువ మొత్తం ఆశిస్తున్నట్టు అభిప్రాయపడిందని ఈ వ్యవహారంతో నేరుగా సంబంధం ఉన్న ఒకరు పేర్కొన్నారు.
దీనికి సంబంధించి టాటా కన్స్యూమర్ గానీ, హల్దీరామ్స్ అధికారికంగా స్పందించేందుకు నిరాకరించాయి. 1937లో స్థాపించిన హల్దీరామ్స్ బ్రాండ్ ఒక చిన్న దుకాణంలో మొదలైంది. స్నాక్ మార్కెట్లో ఈ కంపెనీ 13 శాతం వాటాను, లేస్ బ్రాండ్ చిప్స్‌ను విక్రయించే పెప్సీ కూడా దాదాపు 13 శాతం వాటాను కలిగి ఉంది.