- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tata Group: ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలివ్వనున్న టాటా గ్రూప్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తయారీ రంగంలో భారీగా ఉద్యోగాలను సృష్టించాలని టాటా గ్రూప్ భావిస్తోందని టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ అన్నారు. అందులో భాగంగా రాబోయే ఐదేళ్ల కాలంలో 5 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్టు చెప్పారు. మంగళవారం జరిగిన ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్(ఐఎఫ్‌క్యూఎం) కార్యక్రమంలో మాట్లాడిన చంద్రశేఖరన్.. తయారీ అతిపెద్ద అవకాశం ఉన్న రంగం. ఈ రంగంలో ఉద్యోగాలను సృష్టించకపోతే వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించలేం. ప్రతి నెలా దేశంలో 10 లక్షల మంది వర్క్‌ఫోర్స్‌లోకి అడుగుపెడుతున్నారు. మనం 10 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి. సెమీకండక్టర్ వంటి రంగాల్లో ప్రత్యక్షంగా ఒక ఉద్యోగాన్ని ఇవ్వగలిగితే, పరోక్షంగా 8-10 ఉద్యోగాలకు అవకాశం ఏర్పడుతుందని వివరించారు. సెమీకండక్టర్‌తో పాటు అసెంబ్లీ, ఈవీ, బ్యాటరీ, సంబంధిత రంగాల్లో టాటా గ్రూప్ పెట్టుబడులు పెడుతుంది. తద్వారా వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుంది. టాటా గ్రూప్ కొత్త ప్లాంట్ల ఏర్పాటు ద్వారా తయారీ రంగంలో అనుబంధంగా చిన్న పరిశ్రమలు పుట్టుకొస్తాయని చంద్రశేఖరన్ తెలిపారు. ఇదే సమయంలో తయారీ రంగంలో లక్షలాది ఉద్యోగావకాశాలు పెరగాలంటే ప్రభుత్వం నుంచి కూడా సహకారం కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.