- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టారోలో పూర్తి వాటా కోసం సన్ ఫార్మా ఆఫర్
ముంబై: ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ సన్ ఫార్మా, మెజారిటీ వాటాదారుగా ఉన్న టారో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌లో షేర్లను కొనుగోలు చేసేందుకు ఆఫర్ చేసినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం టారో కంపెనీలో సన్ ఫార్మాకు 78.48 శాతం వాటా ఉంది. అయితే మిగిలిన షేర్లను కొనుగోలు చేయడం ద్వారా 100 శాతం వాటా సన్ ఫార్మా చేతుల్లోకి వెళ్లనుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలో సన్ ఫార్మా దాఖలు చేసిన నివేదిక ప్రకారం, షేర్ల కొనుగోలుకు సంబంధించి ప్రతిపాదిత ధర ఒక్కో షేరుకు $38 గా నిర్ణయించారు. ఇది మే 25న టారో ముగింపు ధర కంటే 32 శాతం ఎక్కువ, అలాగే 60 ట్రేడింగ్ రోజుల్లో సాధారణ షేర్ల సగటు ముగింపు ధర కంటే 41.5 శాతం ఎక్కువ.
ఇజ్రాయెలీ కంపెనీల చట్టం, 1999 ("ICL") ప్రకారం, ఈ లావాదేవీని త్రిభుజాకార విలీనం రూపంలో పూర్తి చేయనున్నట్లు సన్ ఫార్మా తెలిపింది. ఈ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడానికి కంపెనీ ఎటువంటి గడువు ఇవ్వలేదు. సన్ ఫార్మాస్యూటికల్స్ శుక్రవారం మార్చి 31, 2023 తో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,984.47 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నివేదించింది.