18 వేల మార్కును దాటిన నిఫ్టీ!

by Harish |
18 వేల మార్కును దాటిన నిఫ్టీ!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి లాభాలను సాధించాయి. బుధవారం ట్రేడింగ్‌లో ఉదయం నుంచి చివరి దాకా ఊగిసలాట మధ్య కదలాడిన సూచీలు చివరికి సానుకూల ర్యాలీని చూశాయి. ముఖ్యంగా టోకు ద్రవ్యోల్బణం 24 నెలల కనిష్టానికి దిగిరావడంతో పాటు కీలక రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధరలు రాణించడంతో స్టాక్ మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. మిడ్-సెషన్ నుంచి ఒడిదుడుకులు పెరిగినప్పటికీ చివర్లో ఐటీ, ఆటో, రియల్టీ రంగాల్లో కొనుగోళ్లు పుంజుకున్నాయి. వీటికి తోడు నిఫ్టీ బెంచ్‌మార్క్ జనవరి నెల చివరి వారం తర్వాత మళ్లీ 18 వేల మార్కును చేరుకోవడంతో సూచీలు సానుకూలంగా స్థిరపడ్డాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 242.83 పాయింట్లు లాభపడి 61,275 వద్ద, నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 18,015 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, రియల్టీ, ఆటో రంగాలు మెరుగ్గా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా అత్యధికంగా 6 శాతం వరకు దూసుకెళ్లింది. రిలయన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాలు సాధించాయి. హిందూస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్అండ్‌టీ, ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.84 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed