Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. 24,000 దిగువకు నిఫ్టీ..!

by Maddikunta Saikiran |
Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. 24,000 దిగువకు నిఫ్టీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు(మంగళవారం) భారీ నష్టాల్లో ముగిశాయి. రెండో త్రైమాసికంలో కంపెనీలు ఆశించినంత మేర రాణించకపోవడం, ఫారిన్ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఒత్తిడితో మన బెంచ్ మార్క్ సూచీలు ఈ రోజు తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా ఈ రోజు బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాక్ షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్‌(Sensex) ఉదయం 79,644.95 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలయ్యింది. ఇంట్రాడేలో 78,547.84 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్‌ చివరికి 820.97 పాయింట్ల నష్టంతో 78,675.18 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 257 పాయింట్లు తగ్గి 23,883.45 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.29 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.40 దగ్గర ముగిసింది.

లాభాలో ముగిసిన షేర్లు : ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, సన్ ఫార్మా, రిలయన్స్

నష్టపోయిన షేర్లు : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్

Advertisement

Next Story