స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుతో స్టార్ హెల్త్ భాగస్వామ్యం!

by Vinod kumar |
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుతో స్టార్ హెల్త్ భాగస్వామ్యం!
X

న్యూఢిల్లీ: ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ తన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను మెరుగుపరిచేందుకు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు సోమవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా స్టార్ హెల్త్ తన ఆరోగ్య బీమా ప్లాన్‌లను బ్యాంకుకు చెందిన నెట్‌వర్క్ ద్వారా వినియోగదారులకు తక్షణం అందుబాటులో ఉంటాయి.

దేశవ్యాప్తంగా 42 నగరాల్లో 100 బ్రాంచులో విస్తరించిన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు సమగ్రమైన ఆరోగ్య బీమా కావాలనుకునే వినియోగదారులకు వన్-స్టాప్ డెస్టినేషన్‌గా ఉపయోగపడుతుందని బీమా కంపెనీ పేర్కొంది. అంతర్జాతీయ బ్యాంకుతో సహకారం ద్వారా బీమా ఉత్పత్తిలను మరింత విస్తరించడమే కాకుండా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా బీమా సేవలను అందిస్తామని స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సీఈఓ, ఎండీ ఆనంద్ రాయ్ అన్నారు. దేశంలోని ప్రతి ప్రాంతంలో అందరికీ నాణ్యమైన ఆరోగ్య బీమాను అందించగలమని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed