ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15 వేలలోపు ధరలో స్మార్ట్‌ఫోన్లు

by Harish |   ( Updated:2023-10-06 12:09:29.0  )
ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15 వేలలోపు ధరలో స్మార్ట్‌ఫోన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: పండుగల సీజన్ నేపథ్యంలో ఇప్పటికే పలు ఈ కామర్స్ కంపెనీలు వరుసగా సేల్‌లను ప్రకటిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 తీసుకురానుంది. దీనిలో భాగంగా అన్ని రకాల ఉత్పత్తులు, పరికరాలపై డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌లు కొనాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం. యాపిల్, శామ్‌సంగ్, వివో మొదలగు టాప్ కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లను కూడా భారీ తగ్గింపు ధరలతో సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ అక్టోబర్ 7 నుండి ప్రారంభమై అక్టోబర్ 15న ముగుస్తుంది. ఈ సేల్‌లో ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపులతో పాటు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. రూ.10 వేల నుండి రూ.15 వేల ధరలో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

Infinix Hot 30 5G స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల పూర్తి-HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek Dimensity 6020 SoC ద్వారా పనిచేస్తుంది. దీని అసలు ధర రూ.12,499. కానీ ఇది రూ.11,499కే లభిస్తుంది. Realme 11X 5G స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.14,999. కానీ ఇది రూ.12,999కే అందుబాటులో ఉంటుంది. Redmi Note 12 5G మోడల్‌ను పలు ఆఫర్ల ద్వారా రూ.15,000 లకు సొంతం చేసుకోవచ్చు. Samsung Galaxy F34 5G 6GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్‌ను బ్యాంక్ ఆఫర్ తగ్గింపుతో రూ.14,999 కే కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Next Story