- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి తర్వాత ఆధార్ కార్డ్‌లో ఇంటిపేరును ఇలా మార్చుకొండి
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ప్రతి పౌరుడికి అత్యంత ముఖ్యమైన కార్డులలో ఆధార్ కార్డ్ ఒకటి. భారత ప్రభుత్వం జారీ చేసిన 12-అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య కలిగి ఉన్న ఆధార్ కార్డు వివిధ సంక్షేమ పథకాలకు గుర్తింపుగా ఉపయోగపడుతుంది. 12-అంకెల ఆధార్ నెంబర్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేస్తుంది. బ్యాంకు ఖాతా తెరవడం లేదా ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టడం లేదా జాతీయ పథకాలను పొందడం వంటి అనేక కార్యకలాపాలను నిర్వహించడానికి ఆధార్ కార్డ్ అవసరం.
ఆధార్ కార్డ్‌లో వ్యక్తులకు సంబంధించిన సరి అయిన వివరాలు ఉంటాయి. ఏవైనా మార్పులు ఉన్నట్లయితే సకాలంలో అప్‌డేట్ చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మహిళలు వారి వివాహం తరువాత ఇంటి పేరు మార్చాల్సి వస్తుంది. కొంతమంది మాత్రం తమ ఇంటి పేరును అలాగే కొనసాగిస్తారు. కానీ వివాహం తర్వాత ఆధార్ కార్డ్‌లో తమ ఇంటిపేరును మార్చుకోవాలనుకునే వారికి సులభంగా మార్చుకునేలా UIDAI వెబ్‌సైట్‌లో కొన్ని మార్పులు చేసింది.
ఆధార్ కార్డ్‌లో ఇంటిపేరును మార్చుకోవడానికి సులభమైన పద్ధతులు..
* ముందుగా UIDAI అధికారిక స్వీయ-సేవ అప్‌డేట్ పోర్టల్‌కు వెళ్లాలి.
* పేరు, ఇంటి పేరును నమోదు చేయాలి.
* స్వీయ-ధృవీకరించబడిన అవసరమైన పత్రాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.
* తరువాత సబ్మిట్‌పై క్లిక్ చేయడం ద్వారా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
* OTP నంబర్‌ను ఎంటర్ చేయాలి.
సొంతంగా పోర్టల్ ద్వారా పేరు మార్చుకోవడానికి UIDAI ఎలాంటి ఫీజు వసూలు చేయదు.
అదే ఆఫ్‌లైన్‌లో ఇంటిపేరును మార్చుకోవాలంటే సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. వివాహ ధృవీకరణ పత్రం వంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాలి. ఆఫ్‌లైన్ ద్వారా పేరు మార్పు కోసం రూ. 50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
బీమా రంగంలో టెక్నాలజీ పరిష్కారాలకు ఐఆర్‌డీఏఐ ఆహ్వానం!
ఆ డబ్బులు కావాలంటే ఖచ్చితంగా Aadhaarఉండాల్సిందే.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
Andhra News: త్వరలోనే ఆధార్‌లో మారనున్న జిల్లాల అడ్రస్‌లు..?