Shyamakant Giri: గ్లాండ్ ఫార్మా కొత్త సీఈఓగా శ్యామకాంత్ గిరి నియామకం

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-20 11:56:35.0  )
Shyamakant Giri: గ్లాండ్ ఫార్మా కొత్త సీఈఓగా శ్యామకాంత్ గిరి నియామకం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ(Pharma Company) గ్లాండ్ ఫార్మా లిమిటెడ్(Gland Pharma Ltd) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌(New CEO)గా శ్యామకాంత్ గిరి(Shyamakant Giri)ని నియమించింది. ఈ విషయాన్ని కంపెనీ శనివారం అధికారంగా ప్రకటించింది. 2025 జనవరి 15వ తేదీన ఆయన పదవీ బాధ్యతలు చేప్పట్టనున్నట్లు తెలిపింది. కాగా గిరి ప్రస్తుతం అమ్నీల్ ఫార్మాస్యూటికల్స్(Amneal Pharmaceuticals)లో ఇండియా బిజినెస్ అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్(India Business & Emerging Markets)కు అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఇతనికి ఆసియా, ఆఫ్రికా(Asia,Africa) మార్కెట్‌లలోని భారత దేశానికి చెందిన వివిధ సంస్థలలో ఫార్మాస్యూటికల్స్, డివైజ్‌లు, డయాగ్నోస్టిక్స్,హెల్త్‌కేర్ సర్వీసెస్‌లో 25 సంవత్సరాలకు పైగా పని చేసిన అనుభవం ఉంది. అలాగే కొంతకాలం పాటు రివారా ల్యాబ్స్‌(Rivaara Labs)లో సీఈఓగా పనిచేశారు. కాగా ప్రస్తుతం సంస్థ సీఈఓగా ఉన్న శ్రీనివాస్ సదు(Srinivas Sadu) కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారని, కంపెనీ మలిదశ వృద్ధికి ఆయన ప్రణాళికలను అమలు చేస్తారని గ్లాండ్ ఫార్మా వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed