షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన కోడి గుడ్డు ధరలు.. డజన్ ఎంతంటే..?

by Disha Web Desk 7 |
షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన కోడి గుడ్డు ధరలు.. డజన్ ఎంతంటే..?
X

దిశ, ఫీచర్స్: సమ్మర్ సీజన్ స్టార్ట్ కావడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆమాంతం పెరిగిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కూరగాయాలు, పండ్లు రేట్లను భారీగా పెంచేస్తున్నారు మార్కెట్ నిపుణులు. అంతే కాకుండా ఈ ఎండలకు కూరగాయాలు, పండ్లు లాంటివి తొందరగా పాడవుతున్నాయి. ఈ కారణంగానే వ్యాపారులు రేట్లు కూడా పెంచేస్తున్నారు. ఇక ఈ ఎండ వేడికి మనుషులే పిట్టల్ల రాలిపోతుంటే.. కోళ్లు ఎంత. అవి కూడా వేడిని తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. దీంతో చికెన్ రేట్లు పెరగడంతో పాటు.. కోడి గుడ్లు ధరలు కూడా ఆమాంతం పెరిగిపోతున్నాయి.

ఈ క్రమంలోనే గత నెల రోజులుగా గుడ్డు ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ మేరకు గత నెలతో పోల్చుకుంటే.. ఈ నెల గుడ్డు ధర 70 పైసలు పెగినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో రూ. 4.35 ఉన్న గుడ్డు ధర ఇప్పుడు మే నెలకు 5.25 కు చేరింది. బయట రిటైల్ షాపుల్లో గుడ్డును 6 నుంచి 7 రూపాయల వరకు అమ్ముతున్నారు. దీంతో డజన్ రూ. 72 నుంచి రూ. 84 పలుకుతుంది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ఏదేమైనా నమోదవుతున్న ఎండలకు, పెరుగుతున్న ధరలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి కావడంతో పాటు భయందోళనకు గురవుతున్నారు.

Next Story

Most Viewed