వరుసగా నాలుగో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

by S Gopi |
వరుసగా నాలుగో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా నష్టాలను ఎదుర్కొన్నాయి. బుధవారం ట్రేడింగ్‌లో సైతం సూచీలు భారీ నష్టాలతో వరుసగా నాలుగో రోజు దెబ్బతిన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, రికార్డు గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాలను వెనక్కి తీసుకోవడం, కీలక కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా అధిక నష్టాలు ఎదురయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 667.55 పాయింట్ల నష్టంతో 74,502 వద్ద, నిఫ్టీ 183.45 పాయింట్లు నష్టపోయి 22,704 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, నెస్లె ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఆల్ట్రా సిమెంట్, విప్రో, రిలయన్స్ కంపెనీల స్టాక్స్ 1 శాతానికి పైగా నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.36 వద్ద ఉంది.

Advertisement

Next Story