- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
73 వేలు దాటిన సెన్సెక్స్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గత వరుస సెషన్లలో ఒడిదుడుకులను చూసిన తర్వాత మెరుగైన లాభాలను సాధించాయి. కనిష్టాల నుంచి రికవరీ అవుతున్న సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో రాణించాయి. ప్రధానంగా దేశీయ పరిణామాలు, గణంకాలు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. కీలక మెటల్, బ్యాంకింగ్, ఆటో రంగాలకు తోడు రిలయన్స్, ఎస్‌బీఐ వంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్ల ఉత్సాహంతో మార్కెట్లు వరుసగా మూడవ రోజు లాభపడ్డాయి. సొమవారం సాయంత్రం తర్వాత విడుదల డేటాలో భారత రిటైల్ ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్టానికి దిగిరావడం ర్యాలీకి దోహదపడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 328.48 పాయింట్లు పుంజుకుని 73,104 వద్ద, నిఫ్టీ 113.80 పాయింట్లు లాభపడి 22,217 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఆటో రంగాలు 1.50 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, ఎల్అండ్‌టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. నెస్లె ఇండియా, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ కంపెనీల స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.52 వద్ద ఉంది.