- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
1,241 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలను సాధించాయి. గత కొన్ని సెషన్లుగా బలహీన ర్యాలీని చూసిన సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు దేశీయ బ్యాంకింగ్ రంగాల షేర్లలో పెద్ద ఎత్తున కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. అలాగే, ఇటీవల్ల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న కీలక రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లలో ఉత్సాహం కనిపించింది. ఈ క్రమంలోనే కీలక బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. రిలయన్స్ సంస్థ షేర్లు సోమవారం ఒక్కరోజే దాదాపు 7 శాతం పుంజుకోవడంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.2 లక్షల కోట్లు పెరిగి రూ. 19.56 లక్షల కోట్లకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ సైతం 1.4 శాతం పుంజుకుంది. మరోవైపు, స్టాక్ మార్కెట్లకు మద్దతిచ్చేలా చైనా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆసియా మార్కెట్లు రాణించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,240.90 పాయింట్లు ఎగసి 71,941 వద్ద, నిఫ్టీ 385 పాయింట్లు లాభపడి 21,737 వద్ద ముగిశాయి. నిఫ్టీలో దాదాపు అన్ని రంగాలు 1 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్ 6.86 శాతం పుంజుకోగా, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, ఎల్అండ్‌టీ, కోటక్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఆల్ట్రా సిమెంట్, టైటాన్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. ఐటీసీ, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, టీసీఎస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.16 వద్ద ఉంది.