- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజంతా నష్టాల్లోనే ర్యాలీ చేసిన సూచీలు!
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ వారం నష్టాలను మొదలయ్యాయి. గతవారాంతం బలహీనపడిన తర్వాత సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారాయి. బడా కంపెనీల షేర్లలో అమ్మకాలకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారనంగా మిడ్-సెషన్ నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కదలాడాయి. మరోవైపు అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం కొనసాగుతుండటం కూడా మదుపర్లపై ప్రభావితం చేసింది.
అదేవిధంగా భారత్‌తో పాటు అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం కూడా మార్కెట్ల నష్టాలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వీటితో పాటు ముడి చమురు ధరలు పెరుగుతుండటం కొంత ఒత్తిడి కలిగించింది. సూచీల ర్యాలీలో సానుకూల, ప్రతికూల పరిణామాలు రెండూ ఉండటం నష్టాలకు దారితీశాయని నిపుణులు తెలిపారు.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 250.86 పాయింట్లు కోల్పోయి 60,431 వద్ద, నిఫ్టీ 85.60 పాయింట్లు నష్టపోయి 17,770 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ రంగం మాత్రమే అత్యల్పంగా రాణించింది. బ్యాంకింగ్, మెటల్, మీడియా, ఐటీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, ఎల్అండ్‌టీ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, టెసీఎస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫినాంచె, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.71 వద్ద ఉంది.