- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుసగా ఐదో రోజూ నష్టాల్లో సూచీలు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో అధిక నష్టాలు కొనసాగుతున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో సైతం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దగ్గరపడుతుండటం వంటి పరిణామాలతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకోవడం, ఎఫ్అండ్ఓ గడువు ముగియడం, కీలక కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా వరుసగా ఐదో సెషన్‌లో నష్టాలు ఎదురయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 617.30 పాయింట్లు నష్టపోయి 73,885 వద్ద, నిఫ్టీ 216.05 పాయింట్ల నష్టంతో 22,488 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ సహా కీలక రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్, ఎల్అండ్‌టీ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, టైటాన్, విప్రో, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, నెస్లె ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ స్టాక్స్ 2-6 శాతం మధ్య నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.29 వద్ద ఉంది. వరుస నష్టాల కారణంగా గురువారం సైతం మదుపర్లు ఒక్కరోజే రూ. 4.49 లక్షల కోట్లను కోల్పోయారు. దాంతో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. రూ. 410 లక్షల కోట్లకు చేరింది.