- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుసగా రెండోరోజు మిశ్రమంగా మార్కెట్ల ర్యాలీ!
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మరోసారి మిశ్రమ ఫలితాలు కనిపించాయి. బడ్జెట్ ప్రకటనల్లో ప్రభావితం చేసే అంశాలు లేకపోవడం, అదానీ కంపెనీల షేర్ల పతనం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల మధ్య కీలక బెంచ్‌మార్క్ సూచీల్లో సెన్సెక్స్ లాభాలను సాధించగా, నిఫ్టీ మాత్రం స్వల్ప నష్టాలను ఎదుర్కొంది. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు మార్కెట్ల ర్యాలీకి మద్దతిచ్చాయి. గురువారం ట్రేడింగ్‌లో మిడ్-సెషన్ వరకు లాభనష్టాల మధ్య కదలాడిన సూచీలు ఆ తర్వాత చివరి గంట నిఫ్టీలో అమ్మకాలు పోటెత్తడంతో మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 224.16 పాయింట్లు లాభపడి 59,932 వద్ద, నిఫ్టీ 5.90 పాయింట్లు నష్టపోయి 17,610 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్ రంగం అత్యధికంగా 4 శాతానికి పైగా కుదేలైంది. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, టైటాన్, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.22 వద్ద ఉంది.
ఇవి కూడా చదవండి : వారంతం ఎట్టకేలకు భారీ లాభాల్లోకి మారిన స్టాక్ మార్కెట్లు