- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Stock Market: నిఫ్టీ @25000
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. అంతకుముందు రెండు సెషన్‌లలో స్తబ్దుగా సాగిన సూచీలు గురువారం ట్రేడింగ్‌లో సరికొత్త గరిష్ఠాలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు రికార్డు లాభాలకు కారణమయ్యాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఇండెక్స్ చరిత్రలో తొలిసారి 82,000 మార్కును, నిఫ్టీ 25,000 మైలురాయిని అధిగమించాయి. సెన్సెక్స్ ఆ తర్వాత కొంత వెనుకబడినప్పటికీ నిఫ్టీ కీలక మార్కుపైనే నిలిచింది. అమెరికా ఫెడ్ తన సమావేశంలో సెప్టెంబర్‌లో వడ్డీ రేట్ల కోత విధించేందుకు నిర్ణయించడంతో గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ ఊపందుకుంది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 126.21 పాయింట్లు లాభపడి 81,867 వద్ద, నిఫ్టీ 59.75 పాయింట్ల లాభంతో 25,010 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ సుజుకి, అదానీ పోర్ట్స్, నెస్లె ఇండియా షేర్లు లాభాలను సాధించాయి. ఎంఅండ్ఎం, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, ఎల్అండ్‌టీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.74 వద్ద ఉంది.
మూడో వేగవంతమైన 1000 పాయింట్లు..
అమెరికా ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ నుంచి వడ్డీ రేట్లకు సంబంధించి సానుకూల ప్రకటన నేపథ్యంలో దేశీయంగా నిఫ్టీ ఇండెక్స్ గణనీయంగా పుంజుకుంది. దీంతో చరిత్రలో తొలిసారిగా 25,000 మార్కును నిఫ్టీ దాటింది. ఈ నేపథ్యంలోనే 24,000 నుంచి 25,000 మైలురాయి చేరేందుకు నిఫ్టీ కేవలం 24 ట్రేడింగ్ సేషన్‌లను మాత్రమే తీసుకోవడం విశెషం. ఇది స్టాక్ మార్కెట్లలో మూడో వేగవంతమైన వెయ్యి పాయింట్ల ర్యాలీగా నిలిచింది. అంతకుముందు 23 వేల నుంచి 24 వేలకు చేరడానికి 23 రోజుల సమయం తీసుకుంది. ఇప్పటివరకు 2021, ఆగష్టులో నిఫ్టీ 16 వేల నుంచి 17 వేల పాయింట్లకు పెరిగేందుకు కేవలం 19 ట్రేడింగ్ సెషన్‌లలోనే సాధించింది.
నిఫ్టీ కీలక మైలురాళ్లు
1000 నవంబర్ 1995
5000 27 సెప్టెంబర్ 2007
10,000 26 జూలై 2017
15,000 8 ఫిబ్రవరి 2021
20,000 11 సెప్టెంబర్ 2023
21,000 14 డిసెంబర్ 2023
22,000 20 ఫిబ్రవరి 2024
23,000 2, జూన్ 2024
24,000 27, జూన్ 2024
25,000 1 ఆగష్టు 2024