- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ల కట్టడికి సెబీ చర్యలు..!
ముంబై : ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ల కారణంగా చిన్న పెట్టుబడిదారులు నష్టపోకుకుండా కాపాడేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొత్త మార్గాన్ని తీసుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కోసం రూ.7.5 లక్షల వరకు వసూలు చేసే ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు లేదా ఫిన్‌ఫ్లుయెన్సర్లను నియంత్రణ పరిధిలోకి రానున్నారు. ప్రస్తుతం ప్రతిపాదిత దశలోనే ఉన్న ఈ విధానం త్వరలో అమలు కానుంది. గత కొన్నేళ్లలో ఫిన్‌ఫ్లుయెన్సర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. వారిచ్చే సలహాల మేరకు ప్రజలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కూడా పెడుతున్నారు. అయితే, సోషల్ మీడియా ద్వారా మోసం చేసే తరహా ఫిన్‌ఫ్లుయెన్సర్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నారు.
ఈ క్రమంలోనే సెబీ కొత్త మార్గాన్ని అన్వేషించింది. సెబీ ప్రతిపాదిత చర్యల కారణంగా పెట్టుబడిదారులకు ఖచ్చితమైన సమాచారం అందుతుంది. అంతేకాకుండా మోసాలను తగ్గించేందుకు సహాయపడుతుందని ఆనంద్ రాఠీ వెల్ సీఈవో ఫిరోజ్ అజీజ్ తెలిపారు. అదేవిధంగా, ఫిన్‌ఫ్లుయెన్సర్లు సెబీ వద్ద నమోదు చేసుకోవాలి. నిర్దిష్ట మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. ఇదే సమయంలో సెబీ వద్ద రిజిస్టర్ చేయని ఫిన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో పబ్లిసిటీకి మ్యూచువల్ ఫండ్, స్టాక్ బ్రోకర్లతో భాగస్వామ్యం కుదుర్చుకోకుండా నిషేధించాలని సెబీ ప్రతిపాదించింది.