ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు ఆమోదం తెలిపిన సెబీ

by S Gopi |
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు ఆమోదం తెలిపిన సెబీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ తన ఐపీఓ కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి గ్రీన్ సిగ్నల్ పొందింది. గతేడాది డిసెంబర్‌లో కంపెనీ పబ్లిక్ ఇష్యూ కోసం ప్రాథమిక పత్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామంతో సెబీ నుంచి ఐపీఓ కోసం అనుమతి సాధించిన మొదటి ఈవీ స్టార్టప్ కంపెనీగా ఓలా ఎలక్ట్రిక్ నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో అతిపెద్ద న్యూ-ఏజ్ కంపెనీగా ఉంది. ఐపీఓ నుంచి ఓలా ఎలక్ట్రిక్ మొత్తం రూ. 7,250 కోట్ల వరకు సమీకరించాలని భావిస్తోంది. కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 5,500 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద మిగిలిన మొత్తాన్ని(9.52 కోట్ల షేర్లు) సమీకరించనుంది. పబ్లిక్ ఇష్యూ కోసం కంపెనీ వ్యవస్థాపకుడు 4.73 కోట్లు, ఆల్ఫావేవ్, ఆల్పైన్, మ్యాట్రిక్స్ కంపెనీలు 4.78 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఐపీఓ నుంచి వచ్చే మొత్తాన్ని మూలధన వ్యయం, అప్పులు, ఆర్అండ్‌బీ, విస్తరణ సహా కార్పొరేట్ అవసరాల కోసం వినియోగిస్తామని ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed