- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
F&O: ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌పై 6,000 మంది సూచనలు అందాయన్న సెబీ చీఫ్
దిశ, బిజినెస్ బ్యూరో: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో వాల్యూమ్‌లను అరికట్టడానికి సంబంధించిన సంప్రదింపుల పత్రంపై 6,000 మంది వాటాదారుల నుండి సూచనలు అందాయని దాని చీఫ్ మధబి పూరి బచ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఆమె మాట్లాడుతూ, మొత్తం 6,000 సూచనలు ఒక్కొక్కటిగా చదవాలంటే చాలా సమయం పడుతుంది. వాటిని కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా అర్థం చేసుకుంటామని చెప్పారు.
గతంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌పై మార్కెట్ స్థిరత్వాన్ని పెంచడానికి, అలాగే వీటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ నష్టపోతున్న చిన్న పెట్టుబడిదారులను రక్షించడానికి కఠినమైన ఎఫ్ అండ్ ఓ నిబంధనలను సెబీ ప్రతిపాదించింది. రిటైల్ ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొనడం కష్టతరం చేయడానికి కాంట్రాక్ట్ పరిమాణాన్ని అనేక రెట్లు పెంచాలని, కనీస పరిమాణం రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలు ఉండగా, దీనిని తొలి దశలో రూ.15-20 లక్షలకు, ఆపై రూ.23-30 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. ఆప్షన్ ప్రీమియంలలో100 శాతం మార్జిన్‌ను ముందస్తుగా వసూలు చేయాలని, ఇంట్రా-డే పర్యవేక్షణ, ధరల హేతుబద్ధీకరణ వంటి పలు చర్యలను సెబీ ప్రతిపాదించింది.
దీనికి సంబంధించి కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేయగా, 6,000 మంది వాటాదారులు తమ సూచనలు అందించారు. రిస్క్ ఎక్కువగా ఉండే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ, కుటుంబాలు ఏడాదికి రూ.60,000 కోట్ల వరకు నష్టపోతున్నాయని సెబీ చీఫ్ గతంలో పేర్కొన్నారు. దీనిని అరికట్టడానికే కఠిన నిబంధనలను ప్రతిపాదించారు.