- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదానీ వ్యవహారంపై పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం!
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీల వ్యవహారానికి సంబంధించి అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై విచారణ చేపట్టాలని దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దర్యాప్తు కోసం రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేయాలని, దీనిపై కేంద్రానికి ఆదేశాలివ్వాలని న్యాయవాది విశాల్ తివారీ గురువారం తన పిటిషన్‌లో కోరారు.
దీనిపై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉంది. అదానీ గ్రూప్ మోసపూరితమైన లావాదేవీలను నిర్వహించడమే కాకుండా షేర్ల ధరల్లో అవకతవకలకు పాల్పడుతోందని ఇటీవల హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో అదానీ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. మరోవైపు, అదానీ గ్రూపునకు చెందిన ఓ కంపెనీలో గురువారం హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వ ఎక్సైజ్ అండ్ ట్యాక్సేషన్ విభాగం సోదాలు నిర్వహించింది.
అదానీ విల్మర్‌కు చెందిన గోడౌన్‌లో ఉన్న నిల్వలను అధికారులు తనిఖీ చేసినట్టు సమాచారం. జీఎస్టీ చెల్లింపుల్లో ఉల్లంఘనల కారణంగానే సోదాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సోదాలు సాధారణ తనిఖీనేనని అధికారులతో పాటు అదానీ విల్మర్ కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించాయి.