ఈ వారంలో ఐపీఓకు ఐదు కంపెనీలు!

by Vinod kumar |
ఈ వారంలో ఐపీఓకు ఐదు కంపెనీలు!
X

ముంబై: గత కొన్ని వారాలుగా భారత స్టాక్ మార్కెట్లలో ఐపీఓ కంపెనీలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రాథమిక మార్కెట్లలోకి అడుగుపెట్టిన కంపెనీలు అధిక రెట్ల సబ్‌స్క్రైబ్‌తో పెట్టుబడిదారులను ఆకర్షించాయి. ఈ నేపథ్యంలోనే ఈక్విటీ మార్కెట్లలో పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ) క్యూ కడుతున్న కంపెనీల సంఖ్య పెరిగింది. రానున్న వారంలో పలు సంస్థలు ఐపీఓకు సిద్ధమవుతున్నాయి. అందులో ఎస్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్ సంస్థ ఆగష్టు 3-7వ తేదీల మధ్య ఐపీఓను నిర్వహించనుంది. రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లతో పాటు రూ. 425 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ద్వారా నిధులు సేకరించనుంది.

ఒక్కో ఓషేర్ ధర రూ. 54-57గా నిర్ణయించారు. రూ. 1,500-1,600 కోట్ల ఐపీఓతో వస్తున్న ఫార్మా కంపెనీ కాంకర్డ్ బయోటెక్ ఆగష్టు 4-8 మధ్య ఐపీఓకు రానుంది. సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థ ఒరియానా పవర్ రూ. 59.6 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల జారీతో 1-3వ తేదీల మధ్య ఐపీఓను నిర్వహించనుంది. కంపెనీ షేర్ ధరను రూ. 115-118 మధ్య నిర్ణయించారు. ఇక, ఐటీ సేవల సంస్థ విన్సిస్ ఐటీ సర్వీసెస్ ఇండియా రూ. 49.84 కోట్ల నిధుల సేకరణ కోసం 1-4వ తేదీల మధ్య ఐపీఓ చేపట్టనుంది. కంపెనీ ఒక్కో షేర్ ధర్ను రూ. 121-128గా నిర్ణయించింది. బ్లాక్‌చెయిన్ డెవలప్‌మెంట్ కంపెనీ యుడిజ్ సొల్యూషన్స్ ఆగష్టు 4-8 తేదీల మధ్య రూ. 41.8 కోట్ల నిధులను ఐపీఓ ద్వారా సేకరించనుంది. రూ. 162 ప్రైస్‌బ్యాండ్‌తో కంపెనీ ఐపీఓను నిర్వహించనుంది.

Advertisement

Next Story

Most Viewed