Satvik Green Energy: ఐపీఓకు సిద్ధమైన మరో గ్రీన్ ఎనర్జీ సంస్థ.. సెబీకి దరఖాస్తు..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-19 15:47:30.0  )
Satvik Green Energy: ఐపీఓకు సిద్ధమైన మరో గ్రీన్ ఎనర్జీ సంస్థ.. సెబీకి దరఖాస్తు..!
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ(NTPC Green Energy) ఇటీవలే దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సోలార్ ప్యానల్(Solar Panel) తయారీ కంపెనీ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ(Satvik Green Energy) కూడా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) వద్ద దరఖాస్తు చేసుకుంది. ఐపీవో ద్వారా సుమారు రూ. 1,150 కోట్లను ఆ సంస్థ సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. తాజా షేర్ల ద్వారా రూ. 850 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 350 కోట్లను సమీకరించనుంది. కాగా సాత్విక్ గ్రీన్ ఎనర్జీలో ప్రమోటర్లకు 90 శాతం వాటా ఉంది. ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్ని లోన్స్ కట్టేందుకు, అనుబంధ సంస్థ అయిన సాత్విక్ సోలార్ ఇండస్ట్రీలో పెట్టుబడుల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story