- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samsung: శాంసంగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. స్క్రీన్ రీప్లేస్‌మెంట్ గడువు తేదీ పెంపు..!
దిశ,వెబ్‌డెస్క్: దక్షిణ కొరియా(South Korea) చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్(Samsung) తన యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. స్క్రీన్ రీప్లేస్‌మెంట్ గడువు తేదీని పొడగిస్తున్నట్లు తెలిపింది. కాగా శాంసంగ్ గ్రీన్ లైన్ సమస్య ఎదుర్కొంటున్న కస్టమర్లకు ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ (Screen Replacement) అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబదించిన గడువు సెప్టెంబర్ 30తో ముగియగా.. తాజాగా దీన్ని డిసెంబర్ 31 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం కస్టమర్లు శాంసంగ్ సర్వీస్ సెంటర్‌లను సంప్రదించాలని సూచించింది.
కాగా ఈ ఏడాది ఏప్రిల్ లో శాంసంగ్ నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా శాంసంగ్ గెలాక్సీ S21 సిరీస్ (Samsung Galaxy S21 Series), గెలాక్సీ S22 అల్ట్రా (Galaxy S22 Untra), గెలాక్సీ S21 FE(Galaxy S21 FE) మోడళ్లలో గ్రీన్ లైన్ సమస్య ఎదురవుతోంది. ఈ సమస్యపై అనేక మంది యూజర్లు శాంసంగ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రీన్ లైన్ సమస్య ఎదుర్కొంటున్న యూజర్లకు ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ చేయాలని నిర్ణయించింది. అయితే కస్టమర్లు ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను పొందాలంటే కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. మూడేళ్లలోపు కొనుగోలు చేసిన మొబైల్స్ కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని, ఫిజికల్ లేదా వాటర్ డ్యామేజీ జరగని వాటికి మాత్రమే ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ చేస్తామని వెల్లడించింది.