- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆరేళ్లలో రూ. 3 లక్షల కోట్లకు షాపింగ్ మాల్స్ రిటైల్ అమ్మకాలు!
న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన ఎనిమిది నగరాల్లో షాపింగ్ మాల్స్‌లోని రిటైల్ అమ్మకాలు ఏడాదికి 29 శాతం చొప్పున వృద్ధి చెందుతాయని ఓ నివేదిక వెల్లడించింది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్‌ఫ్రాంక్ మంగళవారం విడుదల చేసిన 'రీఇన్వెంటింగ్ ఇండియన్ షాపింగ్ మాల్స్ ' నివేదిక ప్రకారం, 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి షాపింగ్ మాల్స్‌లో రిటైల్ అమ్మకాలు రూ. 3 లక్షల కోట్ల(39 బిలియన్ డాలర్ల)ను అధిగమిస్తాయని అంచనా వేసింది. వినియోగం పెరగడం, కొత్త మాల్స్ అందుబాటులోకి రానుండటమే దీనికి కారణమని నివేదిక అభిప్రాయపడింది.
ప్రధాన ఎనిమిది నగరాల్లోని మొత్తం రిటైల్ అమ్మకాలు ప్రస్తుతం రూ. 4.13 లక్షల కోట్లుగా ఉంది. ఇది 2028 నాటికి ఏటా 17 శాతం చొప్పున వృద్ధి చెందుతూ రూ. 10.80 లక్షల కోట్లకు చేరుకుంటుందని నివేదిక తెలిపింది. ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణె, కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాల్లోని షాపింగ్ మాల్స్‌లో రిటైల్ అమ్మకాలు ప్రస్తుతం 3 శాతం వృద్ధితో దాదాపు రూ. 64 వేల కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇది కరోనా ముందు స్థాయిని దాటి రూ. 88 వేల కోట్లకు చేరుకుంటుందని నివేదిక పేర్కొంది. రాబోయే ఆరేళ్లలో షాపింగ్ మాల్స్ అత్యంత వేగవంతంగా విస్తరించనున్నాయని, రిటైల్ విభాగంలో సరఫరా పెరిగి షాపింగ్ సెంటర్లలో విక్రయాలు పెరుగుతాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా రీసెర్చ్ డైరెక్టర్ వివేక్ రాఠి వెల్లడించారు.