- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి భారీ మొత్తంలో నిధులు సేకరించనున్న రిలయన్స్ రిటైల్!
న్యూఢిల్లీ: దేశీయ రిలయన్స్ రిటైల్ భారీ మొత్తంలో పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తోంది. దాదాపు 1.5 బిలియన్ డాలర్ల(రూ. 12,400 కోట్లకు పైగా) మొత్తాన్ని సింగపూర్, అబుదాబి, సౌదీ అరేబియాలకు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్‌లతో సహా ఇప్పటికే కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల నుంచి సేకరించాలని భావిస్తోందని ఈ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.
ఈ నిధుల సేకరణ ఇదివరకు వెల్లడించిన 3.5 బిలియన్ డాలర్ల సమీకరణ లక్ష్యంలో భాగం. ఈ నిధుల సేకరణ ప్రక్రియను సెప్టెంబర్ ఆఖరు నాటికి పూర్తి చేయాలని రిలయన్స్ రిటైల్ ఆశిస్తోంది. ఇప్పటికే కంపెనీ ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ(క్యూఐఏ) నుంచి గత నెలలో 1 బిలియన్ డాలర్లను, కేకేఆర్ అండ్ కంపెనీ నుంచి ఈ వారంలో 250 మిలియన్ డాలర్లను అందుకుంది.
సింగపూర్‌కు చెందిన జీఐసీ, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లు రిలయన్స్ రిటైల్ 100 బిలియన్ డాలర్ల విలువతో ఒక్కో సంస్థ 500 మిలియన్ డాలర్ల చొప్పున పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించి రిలయన్స్ రిటైల్, ఇంకా ఇతర సంస్థలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.