Reliance Infra: రూ. 780 కోట్ల ఆర్బిట్రేషన్ కేసును గెలిచిన రిలయన్స్ ఇన్‌ఫ్రా

by S Gopi |
Reliance Infra: రూ. 780 కోట్ల ఆర్బిట్రేషన్ కేసును గెలిచిన రిలయన్స్ ఇన్‌ఫ్రా
X

దిశ, బిజినెస్ బ్యూరో: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్టక్చర్ భారీ ఊరటను దక్కించుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌తో వివాదంలో రిలయన్స్ ఇన్‌ఫ్రాకు అనుకూలంగా రూ.780 కోట్ల ఆర్బిట్రేషన్ కేసును గెలిచింది. ఈ వ్యవహారంలో కలకత్తా హైకోర్టు రిలయన్స్ ఇన్‌ఫ్రాను సమర్థించిందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో రిలయన్స్ ఇన్‌ఫ్రాకు రూ. 780 కోట్లను చెల్లించాలని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌కు ట్రెబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థిస్తూ ఆదేశించింది. దశాబ్దం క్రితం బెంగాల్‌లోని పురూలియాలో 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ కాంట్రాక్టును రిలయన్స్ ఇన్‌ఫ్రా రూ.3,750 కోట్లకు దక్కించుకుంది. కానీ, వివిధ కారణాలతో ప్రాజెక్టు ముందుకెళ్లలేదు. ఈ వ్యవహారంపై దామోదర్ వ్యాలీ అభ్యంతరం తెలుపుతూ నష్టపరిహారం చెల్లించాలని అభ్యర్థించింది. దీనిపై రిలయన్స్ ఇన్‌ఫ్రా కోర్టుకెళ్లింది. దీనిపై 2019లో ట్రెబ్యునల్ విచారణలో రూ. 896 కోట్లు చెల్లించాలని రిలయన్స్ ఇన్‌ఫ్రాకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే, ఈ అంశంపై దామోదర్ వ్యాలీ కలకత్తా హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ట్రెబ్యునల్ తీర్పును సమర్థిస్తూ రూ. 780 కోట్లు కట్టాలని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed